తెలుగు సినిమా పాటలకు తనదైన శైలిలో సరికొత్త సోబగులద్దిన మెలోడి బ్రహ్మ .. " మణిశర్మ ". అలనాటి స్వరకర్త సాలూరి రాజేశ్వరరావు నుంచి వందేమాతరం శ్రీనివాస్ దాకా ఎందఱో మహానుభావుల దగ్గర పనిచేసిన అనుభవమే తనను ఈ స్థాయికి చేర్చిన్దంతున్న మణిశర్మ జీవితంలో కొన్ని పదనిసలు...
" మా ఇంట్లో ఓ హార్మోనియం ఉండేది. వచ్చినా రాకపోయినా దాని దగ్గర కూర్చుని బర్రు బర్రుమని సౌండ్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు వాయించే వాణ్ని చిన్నప్పుడు.
మరి హార్మోనియం మా ఇంట్లో ఎందుకుంది అంటే...సినిమా సంగీతం విషయంలో నా కన్నా మా నాన్న సీనియర్.
ఆయన స్వరకర్త (కంపోసర్) కాదు. వయోలిన్ కళాకారుడు . అందుకే ఎవరికీ తెలియదు. వయోలిన్ నేర్చుకుని సినిమాల్లో చేయాలనే ఆసక్తితో ఎప్పుడో నలభై యాభై ఏళ్ళ క్రితమే బందరు నుంచి మద్రాసుకి చేరుకున్నారు ఆయన. నాన్న వెనకే అమ్మా..సో నేను పుట్టి పెరిగిందంతా మద్రాసు లోనే. సాలూరి రాజేశ్వరరావ్, పెండ్యాల నాగేశ్వరరావ్ లాంటి మహా మహుల దగ్గర పని చేసారు నాన్న. అలా చిన్నప్పటి నుంచి నాకు కూడా సంగీతం మీద ఆసక్తి పెరిగింది. పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఎంత కష్టపడాలో నాన్నకి తెలుసు కాబట్టి మమ్మల్ని ఆ ఫీల్డ్ కి దూరంగా పెట్టాలని చూసేవారు. ఎప్పుదూ చాడువుకోమ్మనే చెప్పేవారు. నేను మాత్రం ఆయన ఇంట్లో లేనప్పుడల్లా హార్మోనియం తో ప్రయోగాలు చేసేవాన్ని.
సాధారణంగా రికార్డింగ్‌లో గిటార్, వయోలిన్ వీటికన్నా కీబోర్డ్ ప్లే చేసేవాల్లకి ఎక్కువ పారితోషికం ఇస్తారు. అందుకని నన్ను కీబోర్డ్ నేర్చుకోమన్నారు నాన్న. పియానో ఒకటి కొన్నారు. రేడియో లో ఇళయరాజా గారి పాటలు విని సాధన చేస్తున్దేవాన్ని. ఇళయరాజా అప్పట్లోనే ఎలెక్ట్రానిక్ ఇంస్త్రుమెంట్లు వాడేవారు. నాకు అర్థం అయ్యేది కాదు.. 'ఈ సౌండ్ ఇలా ఎలా చేసారా' అని ఆశ్చర్యపోతున్దేవాన్ని. ఒకరకంగా చెప్పాలంటే ఇలయరాజాకి ఎకలవ్యసిష్యుడిలా మారిపోయి ఆయన పాటలనే ఎకుఉవగా సాధన చేసేవాన్ని. ఆయన మ్యూజిక్ ను ఆయన కుఉడా నా అంత విని ఉండరు బహుశా !!!
జాకబ్ జాన్...ఇళయరాజా కి, రెహ్మాన్ కి నాకూ చెన్నై లో ఇంకా చాలా మందికి పాశ్చ్యాత్య సంగీత గురువు ఆయనే. ఆయన దగ్గర వెస్ట్రన్ మ్యూజిక్ లో శిక్షణ పొందాను. దాంతోపాటే కర్నాటక సంగీతం కుడా నేర్చుకున్నాను. ఒక వైపు ఇవి నెర్చుకున్తూనె మరో వైపు కచేరిలలో పాల్గొనే వాణ్ని. ఆ కచేరీలిల వాళ్ళ నాకు కలిగిన లాభం ఏంటంటే...పాతపాటల్ని వాయిన్చాల్సి వచ్చేది. ఒక్కో దసాభ్డంలో సంగీతం ఎలా ఉండేదో బాగా అర్థమయ్యేది. సాలూరి, ఘంటసాల, పెండ్యాల లాంటి మహానుభావులు స్వరపరచిన కష్టమయిన కంపోజిసంస్ ని ప్లే చేయటం వల మంచి పట్టు దొరికేది
1982 లో నేను చదువు ఆపేసాను. అప్పటికి నాకు పద్దెనిమిదేళ్ళు. పన్నెండో తరగతి సగం లో ఉండగా... ' నా జీవితం ఇక సంగీతంతోనే ముదిపదిపూయింది, ఇదే నా భవిష్యత్తు' అని అర్థమయింది. వెంటనే చదువుకి ఫుల్స్టాప్ పెట్టేసి పూర్తిగా ఈ రంగం లోకి దిగిపోయాను. ఎప్పుడు సంగీత సాధనే. తర్వాత నన్ను తీసుకెళ్ళి సంగీత దర్శకుడు సత్యం గారి దగ్గర చేర్చారు నాన్న. ఆయన దగ్గర వాయిద్యకారులంతా హెమాహెమీలు. నేనా చిన్నకుర్రాన్ని. కిబోర్డ్ ముందు కుఉర్చుని వణికిపోయాను. ' ఇది మనకోద్దురా బాబొఇ, రికార్డింగ్ ఐపోగానే పారిపోదాం' అన్నంత స్థాయిలో భయపడ్డాను. మొత్తానికి మొదటి రోజు గండం గడిచింది. అంతగా భయపడాల్సిన పని లేదని అర్థమైంది.
సాలూరి రాజేశ్వర రావ్ నుంచి వందేమాతరం శ్రీనివాస్ దాకా.. దాదాపు అందరు సంగీత దర్శకుల దగ్గరా పని చేసి మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏకైక వ్యక్తిని నేనేనేమో. ఎందుకంటే దక్షినాది సినిమాలన్నింటి రికర్దిన్గులకి అప్పట్లో మద్రాసే కేంద్రం. కాబాట్టే అన్ని భాషల సినిమాలకి ఎందఱో మహానుభావులైన సంగీత దర్శకుల దగ్గర పని చేసే అవకాసం వచ్చింది నాకు.
కీరవాణిగారి మొదటి సినిమా నున్చీ ఆయన ప్రతి సినిమాకి పని చేసాను.
ఎందుకలా అనిపించిందో కానీ .. ' మనం చాలా బిజీ కాబోతున్నాం' అని మేం కలిసిన మొదటి రోజే అన్నారు కీరవాణి. ఆ మాట నిజమైంది. కీరవాణి గారి దగ్గర చేసేటప్పుడే రాత్రి పూట వాణిజ్య ప్రకటనలకు (జింగిల్స్) వాయించే వాణ్ని. తెల్లారి ఏ రెండిన్తికో ఇంటికెళ్ళి పడుకుని ప్రొద్దున్నే ఏడింటికల్లా లేచి రికార్డింగ్ స్టూడియో కి పరిగేట్టేవాన్ని. ఈ ప్రస్థానంలో నా కొడుకు ఎలా పెరిగాడో చదివాడో చూసుకోలేదు. వాడి బాల్యాని నేను ఎంజాయ్ చెయ్యలేకపోయాను. అది నేను ఇప్పటికి బాధపడే విషయం.
' క్షణక్షణం' సినిమాకి కీరవాణిగారి దగ్గర పని చేస్తున్నపుడు రాంగోపాల్ వర్మ అప్పుడప్పుడు వచ్చి నా దగ్గర కూర్చుని ఆసక్తిగా గమనించేవాడు.. ఒకరోజు ఉన్నట్టుండి 'మీరు నా సినిమాకి మ్యూజిక్ చేస్తారా' అని అడిగాడు.. 'నాకు అంతగా ఆసక్తి లేదండి' అని చెప్పాను. పెద్ద సంగీత దర్శకుడిని అవ్వాలనే ఆలోచన నాకు అప్పటికి అస్సలు లేదు. నాకు తెలిసిందల్లా ' ఆ రోజు ఎవరి రికార్డింగ్ ఉంది, ఎంత బాగా పని చేసి పెరుతేచుక్కోవాలి' అనే ఆలోచన ఒక్కటే'
అయినా రామూ నన్ను వదలలేదు.. 'మ్యూజిక్ డైరెక్షన్ చెయ్యద్దు కానీ నా సినిమా ఒక దానికి నేపథ్య సంగీతం అందించు ' అన్నాడు. ' మీకు నా మీద అంత నమ్మకం ఉంటె చేస్తాను' అన్నాను. అలా రాంగోపాల్ వర్మ నాకు మొట్టమొదటి సారి రికార్డింగ్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. సినిమా రాత్. హర్రర్ సినిమా. రికార్డింగ్ థియేటర్ లో నేను తడబడుతుంటే రామూ నే నన్ను గైడ్ చేసారు.. తనకు ఎలా కావాలో చాలా వోపికగా చెప్పి చేఇంచుకున్నాడు. మొత్తానికి రికార్డింగ్ పూర్తి అయింది . కొన్నాళ్ళ తర్వాత ' అంతం' సినిమాలో ఒక పాట చేయమంటూ మళ్ళీ రామూ దగ్గరనుంచి పిలుపొచ్చింది. సరే అని వెళ్లి ఒక పాట చేసి ఇచ్చాను.
ఒక సారి మద్రాస్ సిని పరిశ్రమలో సమ్మె మొదలయింది. రికర్దిన్గ్లేవి జరగట్లేదు. ఇంతలో రామూ మళ్ళీ ఓ దెయ్యం సినిమా తీసుకొచ్చి రికార్డింగ్ చేయమన్నాడు. దాంతో అందరం కలిసి బాంబే వెళ్లాం. రీరికార్డింగ్ జరుగుతోంది. రామూ నా దగ్గరికి వచ్చి ' మణిశర్మ నువ్వు రీరికార్డింగ్ కింగ్ వి కానీ, పాటలు కంపోజ్ చేసే సత్తా లేదు నీకు' అని ఏడిపించడం మొదలు పెట్టాడు. నిజంగానే నాకు రోషం వచ్చింది. వెంటనే హెడ్ ఫోన్స్ చెవులకు తగిలించుకొని అప్పటికప్పుడే ఒక ట్యూన్ ప్లే చేసాను. రామూ విన్నాడు. విని... ' చిరంజీవితో నేను చేస్తున్న సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నావు నువ్వు' అన్నాడు.
అనడమే కాదు, నేను చేసిన ట్యూన్ ని తీసుకెళ్ళి...' ఏ. ఆర్. రెహమాన్ ఒక మంచి ట్యూన్ ఇచ్చాడు వింటారా' అని చిరంజీవి, అస్వనీదత్లకు వినిపించాడు (అప్పటికే రోజా, రంగీలా వంటి వరస మ్యూజికల్ హిట్ లతో దేసమంతతా రెహమాన్ ప్రభంజనం సృష్టించాడు). నా పాట వాళ్ళందరికీ బాగా నచ్చేసింది. అప్పుడు... ' ఈ ట్యూన్ చేసింది రెహమాన్ కాదు, మణిశర్మ అని కొత్త మ్యూజిక్ డైరెక్టర్' అంటూ చల్లగా అసలు విషయం బయటపెట్టాడు రామూ. వాళ్ళూ సరే అన్నారు. కాని ఏవో కారణాలతో మొదలు పెట్టిన కొద్ది రోజులకే ఆ సినిమా ఆగిపాయింది.
ఇదంతా ఇలా జరుగుతూనే ఉంది. మరోవైపు ఏరోజుకారోజు నా పని నేను చేసుకుంటూనే ఉన్నాను. కీబోర్డ్ ప్లేయర్ గా నాకున్న డిమాండ్ నాకుంది కాబట్టి పెద్దగా బాధపడలేదు. ఈ సమయం లోనే మహేష్ అనే మ్యూజిక్ డైరెక్టర్ తో పరిచయం అయింది. ' ప్రేమిచుకుందాం రా' సినిమాకి ఆయన దగ్గర చేసాను. ఆ సినిమా దర్శకుడు జయంత్.సి.పరాన్జికి నా స్టైల్ బాగా నచ్చింది.
ఆ తరువాత చిరంజీవి ఒక రోజు మా ఇనితికి ఫోన్ చేసారు. మా అన్నయ్య ఫోనేత్తితే తన పేరు చెప్పారు ఆయన. మా అన్నయ్యకి అర్థం కాక ' ఏ చిరంజీవి?' అన్నాడు క్యాజువల్‌గా. 'నేను హీరో చిరంజీవిని' అనగానే కన్గారుపదుతూ ఫోన్ నా చేతికిచ్చాడు. నేను మాట్లాడితే ' నువ్వు నా సినిమాకి మ్యూజిక్ చేస్తున్నావు, ఇంతకు ముందు మన కాంబినేషన్ లో అనుకున్న సినిమా ఆగిపాయింది కదా, దీంతో కొనసాగిద్దాం' అన్నారాయన. ఆ సినిమానే.... బావగారూ బాగున్నారా...
సంగీత దర్సకుడుగా నాకొచ్చిన తొలి అవకాసం చిరంజీవి గారి సినిమానే అయినా విడుదలైంది మాత్రం ' సూపర్ హీరోస్' . నటుడు ఏ.వి.ఎస్. తో నాకున్న పరిచయం, స్నేహం రీత్యా ఆ సినిమాకి కూడా చేసాను. ముందుగా సూపర్ హీరోస్ విడుదలైంది.
బావగారూ బాగున్నారా పాటలు సూపర్ హిట్ కావడంతో ఇండస్ట్రీ లో మంచి పేరొచ్చింది . జయంత్, గుణశేఖర్ లాంటి మంచి అభిరుచి ఉన్న దర్శకుల సినిమాలకు పని చేసే అవకాశాలు వరసగా వచ్చాయి. దానికితోడు సమరసింహా రెడ్డి, గణేష్, రావోయి చందమామ, చూడాలని ఉంది... ఇలా వెంటవెంటనే పెద్ద హీరోల సినిమాలకు సంగీత దర్సకత్వం వహించే అవకాసం రావడం, అన్నీ మ్యూజికల్ హిట్ లు కావడం నా అదృష్టం.
నేను చేసినవాటిలో ' మురారి' లో ' అలనాటి రామచంద్రునికన్నింట సాటి....' పాట నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇటీవలే విడుదల ఐన ' వరుడు' లోను పెళ్లి పాటకు మంచి స్పందన వస్తోందంటే చాలా ఆనందంగా ఉంది. అంతగా ఆడని సినిమాల్లో పాటలు కూడా పెద్దగా బయటికి రావు. అలాంటప్పుడు కొద్దిగా బాధగా అనిపిస్తుంది.
పద్దెనిమిదో ఏటనే సంగీతమనే ఈ సముద్రంలోకి దూకేసాను. నాకు తెలిసింది ఇదొక్కటే. పాటల ప్రపంచంలో మునిగిపోతే ఇంకేది గుర్తుకురాదు. దేవుడు నాకొక ప్రతిభానిచ్చాడు. నేను చేయగలిగింది కష్టపడి కాపాడుకోవడమే. అదే చేస్తున్నాను. ఈ క్రమంలో కొంత కుటుంబ జీవితాన్ని మిస్సయ్యాను. మా ఆవిదక్కుడా నా మీద ఉన్న ఒకేఒక్క కంప్లైంట్...ఇంట్లో ఎక్కువ గడపనని. చూడాలి , ఇకముందైనా కాస్త వెసులుబాటు చేసుకోవాలి.
ఉపసంహారం : నేను చేసిన పాటకు మొదటి విమర్శకుడు మా నాన్నే. నా పాటల్లో ఏదైనా నచ్చకపోతే ' ఏమిట్రా అది...' అంటూ వెంటనే తిట్టేస్తారు ఆయన. శ్రీసూక్తం, పురుషసూక్తం మొట్టమొదటిసారి రికార్డ్ రూపం లో తెచ్చింది ఆయనే. వేదాలకు అర్థం రాసారు. ఆయనతో పోలిస్తే నేను అల్ల్మోస్ట్ ' పందితపుత్రున్నే'. చిన్నప్పుడు మాకోసం ఎంతో కష్టపడ్డారాయన. ఆయన్ని ఇప్పుడు నేను బాగా చుసుకోగలగడం ఎంతో తృప్తినిచ్చే విషయం.